← Back to news

ఐదుగురు చిన్నారులు బలి.. గాజాలో కూలిన భవనం!

By Lokesh· 16 Sept 2026· Bbc
ఐదుగురు చిన్నారులు బలి.. గాజాలో కూలిన భవనం!

గాజా సిటీలోని తల్ అల్-హవా ప్రాంతంలో ఇప్పటికే దెబ్బతిన్న ఓ భవనం, యుద్ధం కారణంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 20 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భవనం సురక్షితం కాదని ముందే హెచ్చరించినా.. ఉండేందుకు మరో చోటు లేక దాదాపు 10 కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించి, లోపల చిక్కుకున్నవారి కోసం గాలిస్తున్నారు.

More in International