రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలు.. భారత్ కౌంటర్

రష్యా నుంచి చమురు కొనే దేశాలపై అమెరికా ఆంక్షలు ప్రకటించింది. దీనిపై భారత్ గట్టిగా స్పందించింది. ఈ చర్యలు భారత్-అమెరికా సంబంధాలతో పాటూ గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. 140 కోట్ల మంది భారతీయుల ఎనర్జీ సెక్యూరిటే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా వివిధ దేశాల నుంచి ఆయిల్ కొంటామని తెలిపింది. ఈ అంశంపై అమెరికాతో ఉన్నత స్థాయిలో ఇప్పటికే చర్చించినట్లు కేంద్రం చెప్పింది.



