← Back to news

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

By DK· 22 Jul 2026· నాగర్ కర్నూల్ జిల్లా
నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో తాయత్తు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వంటి పూజా సామగ్రి కనిపించడంతో గుప్తనిధుల కోసం పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు.

More in TG