← Back to news

క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ఓ భరోసా

By డీకే· 23 Jun 2026· హైదరాబాద్‌
క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ఓ భరోసా

TG: క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ఓ భరోసా అని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం హాస్పిటల్‌ రెండున్నర దశాబ్దాలపాటు సేవలను అందిచడం గొప్ప విషయమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

More in TG