నవజాత శిశువు మృతి.. ఆస్పత్రి వద్ద ఆందోళన
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ములకలపల్లికి చెందిన విజయలక్ష్మికి పాప జన్మించగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం శిశువును మాతా శిశు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ పాప మృతికి బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


