బాలిక కిడ్నాప్‌కు యత్నం.. అంతలోనే పోలీసుల ఎంట్రీ

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హనుమాన్‌నగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబం పరిచయస్తుడి వద్ద రూ.30వేలు అప్పు తీసుకుంది . డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అప్పు తీర్చే వరకు మీ రెండేళ్ల కుమార్తెను తీసుకెళ్తానంటూ బెదిరించి, బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే డయల్-100కు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ పోలీసులు బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.



