← Back to news

ప్రేమ పెళ్లి..కోపంతో ఇళ్లు కూల్చేసిన తల్లిదండ్రులు

By Gautham Sattva· 1d ago

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు కాదంటారనే భయంతో కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కూతురు తమను కాదనుకుందని, వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి కుటుంబసభ్యులు యువకుడి ఇంటితోపాటు, అతని చిన్నాన్న ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. దీనిపై యువతి స్పందిస్తూ తప్పు తమవారిదే అని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వీడియో రిలీజ్ చేసింది.

More in Crime