Environmental Justice కోసం OUలో మ్యూజికల్ ఈవెంట్

TG: పర్యావరణ న్యాయం (Environmental Justice) అంశంపై అవగాహన కల్పించేందుకు ‘క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ’ ఆధ్వర్యంలో రేపు (12వ తేదీ) సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ గాయని, సామాజిక కార్యకర్త విమలక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో రెలారె ప్రసాద్ (గాయకుడు), జై సూర్య & టీమ్ (రిథమ్స్ ఆఫ్ తెలంగాణ), సురేష్ బాబు & టీమ్ (నది కల్చరల్ సెంటర్) తదితరులు పాల్గొంటారు.


