KTR కాల్ కట్ చేసిన ప్రభాస్
‘ది అండర్ 18 వరల్డ్’ అనే టాక్ షోలో పాల్గొన్న KTRకు అక్కడి పిల్లలు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆయన ఫోన్ నుంచి ప్రభాస్‌కు కాల్ చేయమని అడిగారు. కేటీఆర్ వెంటనే ప్రభాస్‌కు డయల్ చేయగా, ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడారు. అయితే, ఒక పాప ఫోన్ తీసుకుని, "రోడ్డుపై ఫోన్ దొరికింది, ఎవరు మాట్లాడుతున్నారు?" అని సరదాగా ప్రాంక్ చేసింది. దీంతో ప్రభాస్ వెంటనే కాల్ కట్ చేశారు. ఆ తర్వాత KTR మళ్లీ ఫోన్ చేసి ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో ప్రభాస్ కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు SM లో వైరల్ అవుతోంది.



