← Back to news

రోబో డ్యాన్స్‌తో షాప్ ఓపెనింగ్ వైరల్

By Eluri Nani· 1d ago· Instagram
రోబో డ్యాన్స్‌తో షాప్ ఓపెనింగ్ వైరల్

మధ్యప్రదేశ్‌.. ఉజ్జయినిలో ఓ సాండ్‌విచ్ షాప్ ప్రారంభోత్సవానికి రోబోను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ రోబో విలువ 12 లక్షల రూపాయలు. షాప్ ప్రారంభ కార్యక్రమంలో రోబో.. అతిథులను స్వాగతించింది. రిబ్బన్ కటింగ్‌లో పాల్గొంది. తర్వాత డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. రోబోతో ఫొటోలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. సాధారణంగా ప్రముఖులను ఆహ్వానించే ప్రారంభోత్సవాలకు భిన్నంగా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో ఈ ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. కార్యక్రమ <a href="https://www.instagram.com/reels/Dcf9uIwvoee/">వీడియో</a> సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

More in Viral

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!
Viral· 1d ago

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!

AP: మచిలీపట్నం సూపర్‌మార్కెట్‌లో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో షాపింగ్‌ విషయంలో కస్టమర్లకు <a href="https://x.com/telugodikeka/status/2098256314342523224">ఓ అలర్ట్‌ వైరల్‌ అవుతోంది.</a> షాపింగ్‌ చేసేటప్పుడు బోర్డుపై కనిపించిన రేట్‌ చూసి ఐటమ్స్‌ బుట్టలో వేసుకోవడం, బిల్‌ వచ్చాక చెక్ చేయకుండా పే చేయడం చేస్తుంటాం. ముఖ్యంగా ఎక్కువ ఐటమ్స్‌ కొంటే ధరలు గుర్తుండవు. అందుకే ప్రతి ఐటమ్‌ రేట్‌ను ముందే ఫొటో తీసుకోవడం, బిల్‌ వచ్చిన తర్వాత ఒక్కో ప్రైస్‌ను క్రాస్‌ చెక్‌ చేయడం మంచిది. లేకపోతే దగ్గర్లోని కిరాణా షాపులో ధరలు పోల్చి కొనడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.