ఆయుష్ శాఖలో మహిళా అధికారికి వేధింపులు!

AP: విశాఖలో ఆయుష్ శాఖకు చెందిన మహిళా అధికారిని అదే శాఖలోని ఉన్నతాధికారి వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అసభ్యంగా మాట్లాడటంతో పాటు, అభ్యంతరకరంగా తాకినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయంపై కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. వారి సూచనతో రెండు రోజుల క్రితం ఆయుష్ కమిషనర్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.



