← Back to news

సాయికృష్ణ కేసు CBIకి.. జగన్ కీలక స్పందన

By Anusha· 1h ago· X
సాయికృష్ణ కేసు CBIకి.. జగన్ కీలక స్పందన

గాడే సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందిన కేసును CBIకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ తల్లికి నాలుగు వారాల్లో రూ.25 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు రికార్డులను వారం రోజుల్లో CBIకి అందించాలని DGPకి సూచించింది. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై YSRCP అధినేత జగన్‌మోహన్ రెడ్డి Xలో స్పందిస్తూ, బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in AP