బాహుబలి క్లిప్‌తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ మరోసారి తెలుగు సినిమా క్లిప్‌తో తన మెసేజ్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’లోని కాలకేయులతో యుద్ధం చేసే సీన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతకుముందు జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ ఫైట్ సీన్‌ను షేర్ చేసింది. బాహుబలి తరహాలోనే తమ దేశం కోసం రక్తం చిందించేందుకు సిద్ధమని ఇరాన్ తెలిపింది. <a href="https://x.com/IraninHyderabad/status/2104205773236752533">ఈ పోస్ట్ సోషల్ మీడియాలో</a> వైరల్‌గా మారింది.
