← Back to news

టెట్ రూల్స్ మార్చాలి

By rajaratnam· 25 Aug 2026· AP
టెట్ రూల్స్ మార్చాలి

AP : ఇప్పుడు వచ్చిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌తో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న టీచర్లకు ఎలాంటి యూజ్ లేదని వారు అసంతృప్తి చెందుతున్నారు. తమ ఎక్స్‌పీరియన్స్, సబ్జెక్టుల ఆధారంగా కొత్త రూల్స్ తీసుకురావాలని కోరుతున్నారు. అందరికీ ఒకే రకమైన పాస్ మార్కులు కాకుండా న్యాయమైన రూల్స్ పెట్టాలని, ఎగ్జామ్ ఆఫ్ లైన్‌లోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 40% వచ్చిన వాళ్లు క్వాలిఫై అయి, 89% వచ్చినా అనర్హులు కావడం కరెక్ట్ కాదని, వెంటనే టెట్ రూల్స్ మార్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.