← Back to news

ఆరు గ్యారంటీలపై BRS తీవ్ర నిరసన

By Srikanth Goud· 1h ago· Jagitial

TG: జగిత్యాల జిల్లా బీర్పూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై BRS భారీ నిరసన చేపట్టింది. BRS రాష్ట్ర కమిటీ పిలుపుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీపుర్లు పట్టుకుని వీధులు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పల్లె పారిశుధ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.