← Back to news

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

By GANDHAM PRAVEEN KUMAR· 1h ago
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యిరోజుల పాలనపై BRS నిరసన చేపట్టింది. కడెం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన వీధులు, మార్కెట్ ఏరియాలో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 8m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.