భార్యను హతమార్చి.. భర్త షాకింగ్ డెసిషన్

AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడుకి చెందిన లక్ష్మణ్‌రావు(32)కు, శ్యామల(30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ దివ్యాంగులు. ఇంట్లో శ్యామల మృతి చెందగా, లక్ష్మణ్‌రావు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన ఫోన్‌లోని సెల్ఫీ వీడియోను గుర్తించారు. తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆమెను తరచూ గుర్తు చేసుకుంటున్నానని, ఆమె వద్దకు వెళ్లాలనుకుంటున్నానని వీడియోలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను మరణిస్తే భార్య అనాథ అవుతుందనే హత్య చేసినట్లు వీడియోలో పేర్కొన్నాడు.



