నేత్రదానం చేయండి.. ఇద్దరికి చూపు ఇవ్వండి: DMHO డాక్టర్ కృష్ణ

TG : కళ్లు దానం చేస్తే ఇద్దరు అంధులకు చూపు ఇవ్వవచ్చని నాగర్‌కర్నూల్ DMHO డాక్టర్ కె. కృష్ణ చెప్పారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా పాలెం ZPHS స్కూల్‌లో అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. మనిషి చనిపోయిన 6 గంటల్లోపే కళ్లు దానం చేయడం చాలా ముఖ్యం. అందరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు.


