← Back to news

అక్కడ ఆడవాళ్లకు ‘శతమానంభవతి’

By Vishi· 5h ago· Ndtv
అక్కడ ఆడవాళ్లకు ‘శతమానంభవతి’

ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో మహిళలు 100 సంవత్సరాలు పైబడి జీవిస్తున్నారనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటలీకి చెందిన Sardinia ద్వీపంలో ఉన్న Bolotana అనే కొండ ప్రాంత గ్రామం ఇది. ఈ గ్రామంలో 70 ఏళ్లు దాటిన మహిళల్లో దాదాపు 13.8 శాతం మంది 100 ఏళ్ల వయస్సును చేరుకుంటున్నారు. ఇటలీలోని ఇతర ప్రాంతాల్లో లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ శాతం కేవలం 3.5 శాతంగానే ఉంది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి మహిళలు 100 ఏళ్లు జీవించే అవకాశం నాలుగింతలు ఎక్కువ.

More in International