← Back to news

అర్ధరాత్రి మిల్లులో మంటలు.. స్థానికుల్లో టెన్షన్

By డీకే· 3 Jul 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
అర్ధరాత్రి మిల్లులో మంటలు.. స్థానికుల్లో టెన్షన్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో పత్తిగింజల బస్తాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా వడ్ల బస్తాలు ఉన్నప్పటికీ వాటికి పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలోని పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంత ఆలస్యమై ఉంటే మంటలు పక్కనే ఉన్న వడ్ల బస్తాలకు వ్యాపించి భారీ ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

More in TG