← Back to news

అక్రమంగా మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ సీజ్‌

By epuri rajaratnam· 3d ago
అక్రమంగా మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ సీజ్‌

AP: నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోటుపాలెం, చిల్లకూరు మండలం నాంచారమ్మపేట సరిహద్దుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న జేసీబీ, లారీని గూడూరు రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ తవ్వకాలతో భూమి స్వరూపం దెబ్బతినడంతో పాటు వ్యవసాయ భూములకు, పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

More in Local