← Back to news

మెట్‌పల్లిలో ఎమ్మెల్యే సంజయ్ భారీ నిరసన

By Pinjari Shiva Kumar· 1h ago
మెట్‌పల్లిలో ఎమ్మెల్యే సంజయ్ భారీ నిరసన

TG: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో భారీ ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, BRS శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

మెట్‌పల్లిలో ఎమ్మెల్యే సంజయ్ భారీ నిరసన

More in Local