బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. పోక్సో కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్ట్ వారం రోజులపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించాడని మే 8వ తేదీన బాలిక తల్లి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మే 16న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.



