ముఖం చూసి మనసు తెలుసుకోవచ్చా?

ఒకరి ఫేస్ చూసి వారి ఆలోచనలు, భావాలు, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా? చరిత్రకారిణి ఫే బౌండ్-అల్బెర్టీ రాసిన ‘The Face’ పుస్తకం ఈ ఆసక్తికర అంశాన్ని పరిశీలిస్తుంది. శతాబ్దాలుగా మనుషులు ముఖాన్ని గుర్తింపు, వ్యక్తిత్వం, భావోద్వేగాలకు ప్రతిబింబంగా భావిస్తూ వచ్చారని ఇందులో వివరించారు. నేటి రోజుల్లో ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌తో మనసును అంచనా వేయొచ్చనే నమ్మకం ఉన్నా.. ఫేస్ చూసి ఒకరి అంతరంగాన్ని పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదనే అంశాన్ని పుస్తకం చర్చిస్తుంది.

