← Back to news

సైబరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. WFHకు సూచన!

By Mahesh· 2h ago· TG
సైబరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. WFHకు సూచన!

TG: సైబరాబాద్‌లో వర్షాలు, గణేశ్ నిమజ్జన ఊరేగింపుల కారణంగా ట్రాఫిక్ పోలీసులు కీలక <a href="https://x.com/CYBTRAFFIC/status/2100574071234929087">అడ్వైజరీ</a> జారీ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత దశలవారీగా ఎర్లీ లాగ్‌అవుట్ ఇవ్వాలని, వీలైన చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించాలని సూచించారు. స్కూళ్లు, విద్యాసంస్థలు ఆన్‌లైన్ లేదా వర్చువల్ క్లాసులు నిర్వహించాలని కోరారు.

More in TG

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు
TG· 4h ago

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు

TG: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆమె కారులో చిక్కుకోగా.. స్థానికులు వెంటనే బయటకు తీసి రక్షించారు. ఆమెకు చిన్న గాయాలవ్వగా, ఆ టైమ్‌లో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. <a href="https://x.com/TheSiasatDaily/status/2100560044597420441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2100560044597420441%7Ctwgr%5E20015ea7cecccc412ab6f2c2c6f20a30e574b1ae%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fpossible-hit-and-run-causes-car-to-overturn-in-hyderabad-3543806%2F">వీడియో లింక్</a>