వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో విషాద ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం కోసం నేరేడు చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈత రాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా శిరీష ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



