సరికొత్త ఆవిష్కరణ.. వాయిస్ ప్రింటర్ ‘రుద్ర’

AP: ఏలూరు జిల్లాకు చెందిన లింగంపల్లి హిమజ అనే బీటెక్ స్టూడెంట్ ‘రుద్ర’ అనే బ్రెయిలీ లిపి ప్రింటర్‌ను తయారు చేసింది. ముందుగా ఆరు బటన్లతో బ్రెయిలీ లిపిని తయారు చేసి, తర్వాత వాయిస్ కమాండ్‌తో పనిచేసే ప్రింటర్, ఫోటో టైపును తయారు చేసింది. బ్రెయిలీ లిపిని టైప్ చేయడం, చేత్తో రాయడం కష్టం. కానీ ఈ ప్రింటర్ ద్వారా మాటలను నేరుగా బ్రెయిలీ అక్షరాలుగా మార్చి పేపర్‌పై ప్రింట్ చేయవచ్చు. దీంతో హిమజకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆమె జేమ్స్ డైసన్ అవార్డుకు ఎంపికైంది. అంధులకు ఈ ప్రింటర్ చాలా ఉపయోగపడుతుంది.



