మోదీ ప్రచారానికి 14 కోట్ల రూపాయలు

మోదీ గుజరాత్ CMగా బాధ్యతలు చేపట్టి 24 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘వికాస్ సప్తాహ్’ ప్రచారం కోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు 14 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు ఓ వార్తా కథనం తెలిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. 2024లోనూ మోదీ ప్రజా జీవితంలో 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రకటనల కోసం 8 కోట్ల 88 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు RTI ద్వారా తెలిసింది.

