‘Number’లో ‘O’ లేదు.. అయినా ‘No.’ ఎందుకు?

మన రోజువారీ జీవితంలో ‘Number’ అనే పదానికి సంక్షిప్త రూపంగా ‘No.’ను ఉపయోగిస్తుంటాం. అయితే ‘Number’లో ‘O’ అనే అక్షరం లేకపోవడం చాలామందికి ఆసక్తికరమైన విషయం. దీనికి మూలం ఇంగ్లీష్‌లో కాదు, లాటిన్ భాషలోని ‘numero’ అనే పదంలో ఉంది. ‘Numero’ అంటే ‘సంఖ్య ప్రకారం’ లేదా ‘సంఖ్యలో’ అనే అర్థం. ఈ పదం నుంచే ‘N’, ‘O’ తీసుకుని ‘No.’ అనే పదం ఏర్పడింది.


