కడపలో స్పీడ్ బ్రేకర్లు లేక వరస యాక్సిడెంట్లు

కడప కలెక్టరేట్ నుంచి రిమ్స్ వెళ్లే దారిలో వరస యాక్సిడెంట్లు కలకలం రేపుతున్నాయి. కేవలం 3 రోజుల్లోనే 9 యాక్సిడెంట్లు జరిగాయని ప్రజలు చెప్తున్నారు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, బైక్ రేసర్లు, ర్యాష్ రైడర్స్ స్పీడ్‌తో వెళ్లడమే దీనికి రీజన్ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్స్ వెంటనే యాక్సిడెంట్ ఏరియాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు వేయాలని, ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు నిఘా పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.



