ఒంటికాలిపై మున్సిపల్ కార్మికుల నిరసన
TG: తమ జీతాల కోసం ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు వికారాబాద్ మున్సిపల్ కార్మికులు. 10 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదనీ, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి న్యాయం చేయాలని కార్మికులు నిరసన తెలిపారు. అయితే వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు గడ్డం అనన్య వ్యవహరిస్తున్నారు. అలాంటి చోట మున్సిపల్ కార్మికులు ఇలా రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది.


