ధరణి వెనక విదేశీ మాఫియా: సీఎం రేవంత్

BRS ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి వల్లే.. భూ రికార్డుల్లో అక్రమాలు జరిగాయని CM రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. 2018లో ధరణిని తెచ్చి, భూముల వివరాల్ని డిజిటలైజ్ చేస్తూ.. రికార్డులు మార్చేశారనీ.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చుకున్నారని ఆయన అన్నారు. ధరణి వల్ల తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల ఎకరాల భూముల వివరాలు విదేశాల్లోని మాఫియా చేతికి వెళ్లాయనీ.. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుట్ర అని సీఎం ఫైర్ అయ్యారు. ఈ కుట్ర వెనక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.


