హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులకు కొత్త రూల్

TG: హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఇకపై నగర శివార్లలోనే నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బస్సుల ఇష్టారాజ్య పార్కింగ్, రాత్రివేళ భారీగా రాకతో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం పెరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించి, యూజర్ ఛార్జీలతో వాటిని వినియోగించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గాజులరామారంలో 100, శంషాబాద్ వైపు 150 ఎకరాల భూమిని కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

