'నా పరిస్థితి ముందు నుయ్యి'..: సీఎం రేవంత్
అసెంబ్లీలో 22A భూముల అంశంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ తన పరిస్థితి "ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది" అన్నారు. "భూములను నిషేధిత జాబితా నుంచి తీసేస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు. తీయకపోతే అమాయకుల భూమి నిషేధిత జాబితాలో పెట్టారు అంటారు. మరి నేను ఏం చేయాలి. బావిలో దూకాలా?" అని రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై దర్యాప్తుకి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నానని అసెంబ్లీలో ప్రకటించారు.



