← Back to news

శ్మశాన వాటికలో తీరిన నీటి తిప్పలు

By A Srisailam· 23 Aug 2026· షాద్‌నగర్
శ్మశాన వాటికలో తీరిన నీటి తిప్పలు

TG : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని హిందూ శ్మశాన వాటికలో ఇన్నాళ్లూ ఉన్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. నీటి సౌకర్యం లేక అంత్యక్రియలకు వచ్చే ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు గుర్తించారు. అందె మోహన్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ బసవప్ప, కౌన్సిలర్ బచ్చలి నరేష్‌లు కలిసి శ్మశాన వాటికలో కొత్తగా బోరు వేయించారు. దీంతో ఇకపై ఇక్కడికి వచ్చే వారికి నీటి కొరత తీరనుంది. సమస్యను పరిష్కరించిన నాయకులకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

More in Local