చనిపోయిన వృద్ధురాలికి కోతి భావోద్వేగ వీడ్కోలు..
బెంగళూరులో మానవత్వానికి, జంతువుల విశ్వాసానికి నిదర్శనంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. రోజూ కోతులకు ఆహారం పెట్టే ఒక వృద్ధురాలు గుండెపోటుతో మరణించగా, ఆమె కడసారి చూపు కోసం ఒక కోతి అక్కడికి చేరుకుంది. మృతదేహం పక్కనే కూర్చుని, ఆమెను హత్తుకుని భావోద్వేగంతో వీడ్కోలు పలికిన తీరు చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మూగజీవాల పట్ల ఆమె చూపిన ప్రేమే ఆ కోతిని అక్కడికి రప్పించిందని అందరూ చర్చించుకుంటున్నారు.



