బోర్డుల్లేవు.. ప్రొడక్షన్ లేదు..అయినా సీఎంఆర్
నర్సాపూర్.జి మండలంలో లక్ష్మీ ప్రభు, జై హనుమాన్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బోర్డులు, కనీస ఉత్పత్తి లేకున్నా మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. యజమానులు అందుబాటులో లేకపోవడంతో పంచనామా నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ కేటాయించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


