కేరళం అసెంబ్లీ షాకింగ్ డెసిషన్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించాలని.. దేశంలోనే తొలిసారిగా కేరళం అసెంబ్లీ తీర్మానం చేసింది. S.I.R ప్రక్రియలో అవకతవకలను సరిచేసి, అర్హులై ఉండి, తొలగించిన ఓటర్లకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే CECని తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని కోరింది. ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, Chief Justice of India ఉండాలని ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

