చెరువులోకి మురుగు నీరు!

TG: హైదరాబాద్‌లోని పిరం చెరువు మురుగు నీటితో కలుషితమవుతూ ప్రమాదకర స్థితికి చేరుతోంది. చెరువు చుట్టూ భారీ నిర్మాణాలు పెరగడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు చెరువులోకి చేరుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో నీరు కలుషితమై దోమలు, దుర్వాసన సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లో ఆక్రమణలు ఉన్నాయా అనే దానిపై అధికారులు పరిశీలించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకుని, పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.



