← Back to news

మగపిల్లలపై పెరిగిన లైంగిక వేధింపుల కేసులు

By Vishi· 1h ago
మగపిల్లలపై పెరిగిన లైంగిక వేధింపుల కేసులు

TG: తెలంగాణలో మగపిల్లలపై లైంగిక వేధింపుల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 62 మంది బాలురు పోక్సో కేసుల్లో బాధితులుగా నమోదయ్యారు. గతేడాది నమోదైన 61 కేసులను కేవలం 9 నెలల్లోనే ఈ సంఖ్య దాటింది. తెలంగాణ పోలీసుల మహిళా భద్రతా విభాగం వెల్లడించిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. POCSO చట్టం కింద 2024 నుంచి 2026 సెప్టెంబర్ వరకు తెలంగాణలో మొత్తం 127 మంది బాలురు బాధితులుగా నమోదయ్యారు.

More in TG