వరదలో పంటలు నష్టం.. MLC పర్యటన!

వర్షాలు రైతులను కుదేలు చేశాయి. విజయనగరం జిల్లా వంగర మండలంలో కొండచకరాపల్లి, కొప్పర ప్రాంతాల్లో వరి, కూరగాయలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆ ప్రాంతాలను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని అధికారులను కోరారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నారు.



