← Back to news

భూసేకరణలో దళారులను నమ్మొద్దు!

By Sagar· 49m ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
భూసేకరణలో దళారులను నమ్మొద్దు!

రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణకు కూడా భూసేకరణ చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో కొంతమంది దళారులు, మధ్యవర్తులు ప్రజలను మోసం చేస్తున్నారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు నష్టపరిహారం అందుతుందని స్పష్టం చేశారు.

More in Local