స్టూడెంట్స్‌కి యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్

TG : విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా నందిపేట్ పోలీసులు స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. పద్మశాలి కళ్యాణ మండపంలో SI వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు 7 నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ హాజరయ్యారు. డ్రగ్స్ వల్ల హెల్త్, ఫ్యూచర్ ఎలా పాడవుతాయో వీడియోల ద్వారా చూపించి చైతన్యం తెచ్చారు. ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొని విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.




