← Back to news

ఆస్ట్రేలియా విద్యా విధానంతో గ్లోబల్ లెర్నింగ్

By VGRAO· 56m ago· Karimnagar, Karimnagar, Karimnagar
ఆస్ట్రేలియా విద్యా విధానంతో గ్లోబల్ లెర్నింగ్

అంతర్జాతీయ ప్రమాణాల విద్య కోసం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో విద్యారంగ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆధునిక బోధనా పద్ధతులు, అంతర్జాతీయ పాఠ్య ప్రణాళికలు, నైపుణ్య ఆధారిత విద్య, సృజనాత్మకత పెంపొందించే విధానాలు, సాంకేతిక అభ్యాసంపై చర్చించారు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించబడాలని నరేందర్ రెడ్డి తెలిపారు.

More in Local