← Back to news

🌧️ జపాన్‌లో గంటలో 104.5 మి.మీ వర్షం

By siddu vinay· 8 Sept 2026· The Japan Times

జపాన్‌లోని నాగోయాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్క గంటలోనే 104.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంతకుముందెప్పుడూ అక్కడ ఈ స్థాయిలో వర్షం పడలేదు. రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి. కొన్నిచోట్ల కార్ల డోర్ల వరకు నీరు వచ్చేసింది. వరద ముప్పు పెరగడంతో నాగోయాలోని కొన్ని ప్రాంతాల్లో లెవెల్-5 ఎమర్జెన్సీ హెచ్చరిక ఇచ్చారు. సేఫ్టీ కోసం ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

More in International