విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీల నిర్మాణం, అక్టోబర్ 6న జరగనున్న జాతీయ ప్రతినిధుల సభ విజయం కోసం పెద్దపల్లి డిగ్రీ కాలేజీలో సమావేశం జరిపారు. ముఖ్య అతిథి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని, ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS, MSF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


