ఫార్మసిస్ట్స్ డే వేడుకలు

వైద్య రంగంలో ఫార్మసిస్టులు చేసే సేవలు చాలా గొప్పవని తొర్రూరు మెడికల్ ఆఫీసర్ కొనియాడారు. ఇవాళ వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా తొర్రూరు PHCలో కేక్ కట్ చేసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఫార్మసిస్టులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఫార్మసిస్ట్ మహేష్ ఎన్నో ఏళ్లుగా తొర్రూరు PHCలో ఉంటూ ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నారని అన్నారు.


