← Back to news

స్వేచ్ఛ కోసం అబ్బాయి అవతారం..

By Sahani· 8 Sept 2026· Instagram
స్వేచ్ఛ కోసం అబ్బాయి అవతారం..

అఫ్గానిస్థాన్‌లో బాలికల స్వేచ్ఛ కోసం పాటించే 'బచా పోష్' అనే ఆచారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నీలోఫర్ అయూబికి 4 ఏళ్ల వయస్సులో ముసుగు వేసుకోలేదని ఒక వ్యక్తి కొట్టడంతో, ఆమె తండ్రి జుట్టు కత్తిరించి అబ్బాయిగా పెంచారు. పదేళ్ల పాటు అబ్బాయిలా జీవిస్తూ చదువు, స్పోర్ట్స్ కొనసాగించింది. అమ్మాయిలకు స్వేచ్ఛ లేకపోవడంతో కుటుంబాలు వారిని అబ్బాయిలుగా మార్చి బయటకు పంపుతారు. ఈ కష్టాలతో ఆమె యాక్టివిస్ట్‌గా మారి, 2021 తాలిబన్ల ఎంట్రీతో పోలాండ్‌కి షిఫ్ట్ అయింది.

More in International