విశాఖలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ జనం

AP: విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల భూమి కంపించింది. సాగర్‌నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, HB కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలు అధికారికంగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధ్రువీకరించింది. ఈ ఉదయం 5:05:46 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు ప్రకటించింది. రిక్టర్ స్కెల్‌పై 4.5 రికార్డ్ అయినట్లు తెలిపింది.



