స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

TG: భారీ వర్షాలు, గణేష్ నిమజ్జనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎల్లుండి నిమజ్జనం సందర్భంగా HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. దీనికి బదులు నవంబర్ 14న (రెండో శనివారం) పనిదినంగా తెలిపింది. ఇక భారీ వర్షాలతో రేపు ఏపీలోని పోలవరం, TGలోని మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ఇచ్చారు.


